Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చేస్తుందోచ్.. ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో చూసేద్దామా..

by Sumithra |
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చేస్తుందోచ్.. ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో చూసేద్దామా..
X

దిశ, ఫీచర్స్ : ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాఖీ పండగ వచ్చేస్తుంది. సోదరసోదరీమణులు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ రక్షాబంధన్ ను ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటాం. అలాగే ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీని జరుపుకోనున్నాం. అయితే ఈ రక్షాబంధన్ రోజున ఏ రాశి వారిక ఏ రంగు రాఖీ కడితే అనుకూల ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ ?

మేష రాశి : మేశ రాశి వారి జాతకంలో కుజుడు బలపడాలంటే ఎరుపు రంగు రాఖీని కట్టడం మంచిదంటున్నారు పండితులు.

వృషభ రాశి : వృషభ రాశి వారి జాతకంలో శుక్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీని కట్టాలంటున్నారు పండితులు.

మిథున రాశి : మిథున రాశి వారి జాతకంలో బుధ గ్రహం బలపడాలంటే ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారి జాతకంలో చంద్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీ కట్టడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.

సింహ రాశి: ఈ రాశి వారి జాతకంలో సూర్యుడు బలపడాలంటే పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కడితే మంచిదంటున్నారు పండితులు.

కన్య రాశి: ఈ రాశి వారి జాతకంలో బుధ గ్రహం బలపడాలంటే పచ్చ రంగు రాఖీ కట్టని చెబుతున్నారు పండితులు.

తులా రాశి: ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారి జాతకంలో కుజ గ్రహం బలపడాలంటే వారికి ఎరుపు రంగు రాఖీని కడితే మంచిదంటున్నారు పండితులు.

ధనుస్సు రాశి : ఈ రాశి వారి జాతకంలో కుజుడు బలపడాలంటే పసుపు రంగు రాఖీని కట్టాలని పండితులు చెబుతున్నారు.

మకర రాశి : ఈ రాశి వారి జాతకంలో శని బలపడి శుభాలు జరగాలంటే నీలం రంగు రాఖీ కట్టాలంటున్నారు పండితులు.

కుంభ రాశి: ఈ రాశి వారి జాతకంలో శని బలపడాలంటే ఆకాశ నీలి రంగు రాఖీ కట్టాలని చెబుతున్నారు.

మీన రాశి : ఈ రాశి జాతకంలో కుజుడు బలపడాలంటే వారికి పసుపు రంగు రాఖీ కట్టాలంటున్నారు పండితులు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం.

Advertisement

Next Story