Bhogi Festival: 2024లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?

by Prasanna |
Bhogi Festival: 2024లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?
X

దిశ,ఫీచర్స్: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో భోగి కూడా ఒకటి. ప్రతి ఏటా జనవరిలో నెలలో సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ఉదయం భోగి మంటలతో మొదలు పెట్టి హరిదాసు సంకీర్తనలు, కోడి పందాలు, ముగ్గులు పోటీలు, గంగిరెద్దు విన్యాసాలుతో సరికొత్త శోభను సంతరించుకుంది. ఈ రోజునే కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగి పండుగ ఓ రేంజ్ లో చేస్తారు. ఈ ఏడాదిలో భోగి పండుగ 2024 జనవరి 14న వచ్చింది.

భోగి పండుగ ప్రాముఖ్యత

'భగ' అనే పదం నుంచి 'భోగి' పుట్టింది. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఆ తర్వాత భోగి మంటలు వేసి.. అందులో పిడకలు, ఇంట్లోని పాత వస్తువులు అగ్నికి అహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి, మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల ప్రత్యేకత. అంతేకాకుండా భోగి రోజు బొమ్మల కొలువు చేసి.. చిన్న పిల్లల మీద భోగి పోళ్లు పోస్తారు. ఇలా చేయడం వలన పిల్లలు జ్ఞానవంతులు అవుతారని ఓ నమ్మకం.

Advertisement

Next Story

Most Viewed