- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala Updates: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
X
దిశ, వెబ్డెస్క్: ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.
అదేవిధంగా సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 3 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 71,441 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 23,595 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.
Advertisement
Next Story