Maha Shivaratri : మొదటి సారి శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

by srinivas |   ( Updated:2025-02-24 03:00:36.0  )
Maha Shivaratri : మొదటి సారి శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!
X

దిశ, వెబ్ డెస్క్ : హిందువులు జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి ( Maha Shivaratri ) కూడా ఒకటి. ఈ రోజున ఎంతో మంది భక్తులు శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తారు. అయితే, ఈ ఏడాది మనం మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ సారి ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభంగా ఉండనుందని పండితులు చెబుతున్నారు. అయితే, ముఖ్యంగా శివరాత్రి రోజున శివుడికి ఉపవాసం ఉండి భక్తితో ఆయనకి నిత్య పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. ఆ రోజంతా ఆహారం ముట్టకుండా కేవలం ఫలాలు మాత్రమే తీసుకుని ఉపవాసాలు చేసి.. రాత్రి మొత్తం జాగరణ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మొదటి సారి శివరాత్రి రోజు ఉపవాసాలు చేసే భక్తులు కొన్నింటిని తప్పకుండా పాటించాలి.

శివరాత్రి ( Maha Shivaratri ) అనేది చాలా పవిత్రమైన తిథి. ఈ రోజున ముఖ్యంగా శివుడికి చెంబుడు నీళ్ళు పోసిన ఆ భోళా శంకరుడు సంతోషిస్తాడని పండితులు కూడా చెబుతుంటారు. అలాగే, జీవితంలో ఎంత పెద్ద సమస్యలైన ఇట్టే దూరమైపోతాయి. అయితే , శివరాత్రి రోజున మొదటిసారి ఉపవాసాలు చేసే వారు.. రోజంతా భక్తితో శివనామస్మరణ చేస్తూ ఉండాలి. శక్తి కోసం మిల్క్ తాగి, పండ్లను తిని ఉపవాసాలు చేస్తారు. మరికొందరు సాబుదాన టిఫిన్ లు తింటారు. అయితే, వీటిలో వెల్లుల్లీ, ఉల్లీపాయలు లేకుండా చూసుకొవాలి.

అంతే కాకుండా.. శివరాత్రి రోజు తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో శివుడ్ని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగి ఆయన అనుగ్రహం పొందుతారు. ఆ రోజు రాత్రి మొత్తం జాగరణం చేయలేని వారు రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉండాలి. వీటిని పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.



Next Story

Most Viewed