Stambheshwar Mahadev Temple : ప్రపంచంలో అత్యంత రహస్యమైన శివాలయం ఇదే !

by Prasanna |   ( Updated:2023-02-10 04:04:42.0  )
Stambheshwar Mahadev Temple : ప్రపంచంలో అత్యంత రహస్యమైన శివాలయం ఇదే !
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో భోళా శంకరుని యొక్క శివాయలయాలు చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని శివాలయాలు గురించి మాత్రమే మనకి తెలుసు. మనకి తెలియని రహస్య శివాలయాలు కూడా ఉన్నాయట.. వాటిలో స్తంభేశ్వర్ మహాదేవ్ మందిర్ గురించి ఇక్కడ చూద్దాం.

స్తంభేశ్వర్ మహాదేవ్ మందిర్

ఈ శివాలయం అరేబియా సముద్ర తీరం దగ్గర ఉంది. 150 ఏళ్ళ ముందు కనుగొనబడిన ఈ శివాలయం యొక్క వివరాలు శివ పురాణంలోని రుద్ర సమేతలో లభిస్తాయి. ఈ శివాలయం రోజులో రెండు సార్లు మాయమవుతుంది... ఉదయం మరియు సాయంకాలం కొద్దీ సేపటి వరకు కనిపించదట. మరి కొద్దీ క్షణాల తరువాత మళ్లీ తిరిగి ప్రత్యక్షమవుతుంది.

ఈ శివాలయంకు సంబందించిన ఒక కథ పురాణాల్లో ఉంది. తారకాసురుడు అనే పేరు గల రాక్షసుడు శివుడు కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చూసి ప్రసన్నుడు అయిన శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు తారకాసుడు నా యొక్క చావు నీ కుమారుని చేతిలో మాత్రమే ఉండాలి అది కూడా అతని వయస్సు కేవలం 6 రోజులు మాత్రమే అని కోరుకుంటాడు. దానికి శివుడు తదాస్తు అని అదృశ్యమైపోయాడు.

ఇవి కూడా చదవండి : సంగమేశ్వరా క్షమించు !

Advertisement

Next Story