- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుషాంగం ఆకారంలో శివలింగం.. మానవుడి రూపంలో శివుడు..
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలకు, పురాతన ఆలయాలు, అంతు చిక్కని రహస్యాలకు నెలవు. ఎంతో అద్భుతమైన ఆలయాల్లో గుడిమల్లం ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని శివుడు పురుష లింగాకారంలో దర్శనం ఇస్తాడు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది. ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ఒకటవ శాతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయమైన శ్రీ పరుశురామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, కాళహాస్తి మండలంలోని రేణిగుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్రామంలో నెలకొంది. ఈ ఆలయంలో ఉన్న పరశురామేశ్వర స్వామి పురాతన లింగం. గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భాలయంలోని ప్రతిష్ఠించిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగానిలాగా దర్శనం ఇస్తాడు. ఈ లింగం ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చెక్కింది. ఇక్కడ శివుడు సుమారుగా ఐదు అడుగుల ఎత్తు, ఒక అడుగు వెడల్పు ఉంటుంది.
ఈ ఆయలంలోని లింగం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్ర చెబుతుంది. 1911లో గోపీనాథరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడట. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివుడు పురుషాంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఎత్తులో దర్శనం ఇస్తాడు. ఈ పురుషాంగ శివ లింగంపై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారులు చెబుతున్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి గుడిలో పూజలు ఆగిపోయాయి.
ఆలయ విశేషాలు
విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాకారానికి పడమటివైపున పెద్ద గోపుర ద్వారము ఉంది. ఈ ఆలయమునకు వాయవ్య దిశలో అమ్మవారి దేవాలయం ఉంది. దానిని ఆనుకొని దక్షిణంలో వల్లీ-దేవసేనా సమేత కార్తికేయస్వామి గుడి ఉంది. తూర్పు వైపున సూర్యనారాయణుని దేవాలయము ఉంది. ముఖ్యదేవాలయం గోడల పై శాసనాలు చెక్కి ఉన్నాయి. అలాగే గర్భగుడి గజపృష్ఠాకారము కలిగి ఉంది.