వరలక్ష్మీ వత్రం: అప్పుల బాధ నుంచి బయటపడాలంటే అమ్మవారిని ఇలా పూజించండి.. ఇంట్లో ఐశ్వర్యం వర్ధిల్లుతుంది!

by Anjali |
వరలక్ష్మీ వత్రం: అప్పుల బాధ నుంచి బయటపడాలంటే అమ్మవారిని ఇలా పూజించండి..  ఇంట్లో ఐశ్వర్యం వర్ధిల్లుతుంది!
X

దిశ, ఫీచర్స్: శ్రావణమాసంలో వరుస శుభకార్యాలు జరుగుతుంటాయి. ఈ శ్రావణమాసాన్ని ఆధ్యాత్మిక మాసం అటుంటారు. మహిళలంతా పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ నెల మొత్తం మాంసాహారాలకు దూరం ఉంటారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ లక్ష్మిదేవికి పూజలు చేస్తారు. అయితే ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతం చేపట్టితే అమ్మవారి అనుగ్రహం పొందుతారని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. నిష్ఠతో లక్ష్మిదేవికి పూజలు చేయడం వల్ల మంచి ఫలితం దక్కుతుందంటారు. అలా అమ్మవారి అనుగ్రహం పొందినట్లైతే జీవితంలో ఎలాంటి బాధలైన ఇట్లే మాయమవుతాయని వరలక్ష్మి వ్రతం సందర్భంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరీ ఎలాంటి సమస్యలు దూరమవుతాయో పండితులు చెప్పిన విషయాలు ఇప్పుడు చూద్దాం..

హిందూ శాస్తం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 16 వ తారీకున వరలక్ష్మి వ్రతం వచ్చింది. కాగా నేడు అమ్మవారికి వ్రతం చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆడవాళ్లంగా రెడీగా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే పూజలు ప్రారంభించారు. అయితే కొన్నేళ్లుగా అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న వారు నేడు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే..? తలస్నానం చేసి, లక్ష్మిదేవి ఫొటో వద్ద పదకొండు పసుపు కొమ్మలు, గవ్వలను ఎర్రటి గుడ్డలో చుట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి.

అమ్మవారి ఫొటోను పసుపు కుంకుమలతో అలంకరించాలి. 5 లేదా 9 పువ్వులను లక్ష్మిదేవి ముందు వేయ్యాలి. అలాగే రెండు ఏనుగు బొమ్మలను ఉంచాలి. ఆవు నెయ్యితో ఆహారాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే మీ అప్పుల బాధలు తొలగిపోయి.. ఇంట్లో ఐశ్వర్యం వర్ధిల్లుతుందని పండితులు చెబుతున్నారు. గుడ్డలో చుట్టిన గవ్వలను మాత్రం బీరువాలో లేదా ఎప్పుడూ తాకని చోట పెట్టాలంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed