శ్రీవారి ఆలయం ఎదుట ఆక్టోపస్ మాక్ డ్రిల్..

by Sumithra |
శ్రీవారి ఆలయం ఎదుట ఆక్టోపస్ మాక్ డ్రిల్..
X

దిశ, ఫీచర్స్ : తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తులు కాసేపు ఉక్కిరి బిక్కిరయ్యారు. బాలాజీ ఆలయం ఎదుట ఆక్టోపస్ ఎన్ ఎస్ జి బలగాలు ఆక్టోపస్ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉండి ఆలయాలపై దాడులు జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ మాక్ డ్రిల్ ద్వారా ఆక్టోపస్ ఎన్ ఎస్ జి బలగాలు తెలియజేశాయి. శ్రీవారికి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత శనివారం అర్ధరాత్రి సమయంలో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఆలయాల పై ఉగ్రదాడులు జరిగినప్పుడు భక్తులను ఎలా రక్షించాలి, ఉగ్రవాదులు ఆలయ తలుపులను మూసేసినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునేందుకే మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా బలగాలు ముందుగా లైట్లు ఆఫ్ చేసి లిఫ్ట్ ద్వారా మహద్వారానికి చేరుకుని ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మాక్ డ్రిల్ ను చేపట్టారు.

సుమారు అరగంట సేపు 180 ఆయుధాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. దీంతో కొంతసేపటి వరకు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక భక్తులు ఆందోళనకు గురయ్యారు. నిజంగానే ఆలయంలో ఎవరైనా ఉగ్రవాదులు చొరబడ్డారా అని భక్తులు ఒక్కసారిగా బిత్తరపోతారు. కొద్ది సేపటికి ఈ మాక్ డ్రిల్ ను ముందస్తు జాగ్రతల్లో భాగంగా నిర్వహించారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల ఆలయం ఎదుట సాయుధ బలగాల పర్ఫార్మెన్స్ ను వీక్షించిన భక్తజనం భద్రత విషయంలో అటు ప్రభుత్వం, ఇటు టీటీడీ ఎంత అప్రమత్తంగా ఉందో తెలుసుకున్నారు.

Advertisement

Next Story