- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీకృష్ణుడు.. వశిష్ఠ మహర్షికి దర్శనమిచ్చిన క్షేత్రం ఎక్కడుందో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : విష్ణుమూర్తి దశావతారాల్లో ఎనిమిదవ అవతారమే శ్రీ కృష్ణుడి అవతారం. అందుకే కృష్ణుని ఆలయాలు, విష్ణువు ఆలయాలే అనవచ్చును. భారత దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాగే పూర్వం వశిష్ఠ మహర్షి వెన్నతో కన్నయ్య ప్రతిమను చేసి ఆరాధించడంతో పరమాత్మ ప్రత్యక్షమైన క్షేత్రం కూడా నెలకొంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది. ఆ ఆలయ చరిత్ర ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు నాగపట్నం సమీపంలో 'తిరుక్కణ్ణం గుడి' అనే క్షేత్రం వెలసింది. 108 దివ్య తిరుపతులలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రాన్ని కృష్ణారణ్య క్షేత్రం అని కూడా భక్తులు పిలుస్తుంటారు. పూర్వం వశిష్ఠ మహర్షి వెన్నతో కన్నయ్య ప్రతిమను చేసి ఆరాధించడంతో పరమాత్మ ప్రత్యక్షమై వశిష్ట మహర్షిని ఆలింగనం చేసుకున్నాడట. వశిష్టుని భక్తికి మెచ్చి అనుగ్రహాన్ని కూడా ఇచ్చాడట. తిరుమంగై ఆళ్వార్ కీర్తించిన ఈ క్షేత్రంలో కన్నయ్య ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు వారి అనుభవాలు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో కోరిన కోరికలు తప్పకుండా తీరతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో పూవులు పూసినా కాయలు కాయని పొగడ చెట్టును దర్శించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న చింత చెట్టు ఆకులు రాత్రివేళ ముడుచుకుంటాయట. ఈ ప్రదేశంలోనే తిరుమంగై ఆళ్వార్ బంగారు బుద్ధ విగ్రహాన్ని కూడా దాచారట. ఇక ఈ వెన్నదొంగ మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాధ్‌జీగా, మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాఐరోపాపగా కృష్ణునిగా కన్నయ్య పూజలందుకుంటున్నాడు.