- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో పూజగది చెక్కతో చేసింది పెట్టుకోవడం మంచిదేనా?.. వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందంటే?
దిశ, ఫీచర్స్: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేటప్పుడు, ఇంట్లో వంటగది , పూజగది సరయిన దిశలో ఉండేటట్లు చూసుకుంటారు. ప్రస్తుతం పూజగదిని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. కొంతమంది అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్రత్యేక గదిని నిర్మించకుండా ఇంట్లో చెక్క తో చేసింది పెట్టుకుంటున్నారు. అయితే, చాలా ఇళ్లలో చెక్క పూజ గదులు ఉంటాయి. ఇవి వారి ఇంటికి సానుకూల శక్తిని ఇస్తాయా? లేక నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయా? అనేది ఇక్కడ తెలుసుకుందాం..
పూజగది చెక్కతో చేసినట్లయితే, దానిని తయారు చేయడానికి ఉపయోగించే చెక్క సానుకూల శక్తిని ఇచ్చే మంచి కలపగా ఉండాలి. ఇది ఇంటికి సానుకూల శక్తిని ఇస్తుంది. అంతేకాదు అలాంటి పూజ గదిని తెచ్చి బయట ఏర్పాటు చేస్తే ఇంటి గోడకు ఎప్పుడూ వేలాడదీయకూడదు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ప్రసరింపజేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందువల్ల మీరు నమ్మకమైన తయారీదారుల నుంచి పూజగదిని కొనుగోలు చేయవచ్చు.
ఇలా ఇంట్లో అమర్చుకునే పూజా గది శుభాలను, అశుభాలను ఇస్తాయి. మనం ఏర్పాటు చేసుకునే దిశ, వాస్తు ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది, నిర్మాణానికి ఉపయోగించే లోహం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరోవైపు, మార్బుల్ పూజా గదులు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. చాలా దేవాలయాలలో పాలరాతితో చేసిన విగ్రహాలు, ఆలయ గోడ నిర్మాణాలు ఉన్నాయి. కాబట్టి,వీటిని కొనడం కూడా మంచిదే అని వాస్తు నిపుణులు అంటున్నారు.