- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raksha Bandhan : రక్షా బంధన్ నాడు ఈ వస్తువు ఇంటికి తెస్తున్నారా.. మీ అదృష్టం మారిపోయినట్టే..
దిశ, ఫీచర్స్ : దేశవ్యాప్తంగా రక్షా బంధన్ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రక్షాబంధన్‌కు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ పండుగను 19 ఆగస్టు 2024న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. రాఖీ పండుగ అన్నదమ్ముల, అక్కచెల్లెల మధ్య పవిత్రమైన బంధాన్ని నిలుపుతుంది. ఈ రోజున ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి క్షేమాన్ని కోరుకుంటుంది. బదులుగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. అందుకే ఈ రక్షాబంధన్ హిందూ మతంలో అత్యంత గుర్తింపు పొందింది. అయితే ఈ రోజున మీరు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే డబ్బుకు కొరతే ఉండదంటున్నారు పండితులు. మరి అవేంటో చూసేద్దామా.
చాలా కుటుంబాలలో నిత్యం డబ్బుకు లోటు ఉండటమే కనిపిస్తుంది. అలాంటి వారు రక్షాబంధన్ రోజున ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రక్షాబంధన్ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. అలాగే ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. జ్యోతిష్యుల ప్రకారం ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు అయిన శంఖాన్ని తీసుకురావడం మంచి శకునంగా చెబుతున్నారు పండితులు.
ప్రక్రియ..
పవిత్రమైన రక్షాబంధన్ రోజున శంఖాన్ని తీసుకొచ్చి పూజా స్థలంలో ప్రతిష్టించండి. ఆ తర్వాత క్రమం తప్పకుండా పూజించడం ప్రారంభించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చెబుతున్నారు. ఆమె ఆశీస్సులు ఇంట్లో ఉంటాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి డబ్బుకు సంబంధించిన పాత సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.