- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిధులు ఎన్ని రకాలో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : పూర్వకాలంలో రాజులు గుప్తనిధులను కొన్ని ప్రాంతాల్లో దాచిపెట్టి నాగబంధం, చక్రబంధనం లాంటి బంధనాలతో కట్టుదిట్టం చేసేవారు. కొన్ని శక్తులను నిధులకు కాపలాగా ఉంచేవారు. అయితే పరమేశ్వరుడు ఉపదేశించిన దాని ప్రకారం నిధులు నాలుగు రాకాలుగా ఉంటాయి. అవే కచ్చప, మకర, శంఖ, పద్మ అనే నిధులు. ఈ నిధులలో శంఖ, పద్మ నిధులు ఎలాంటి శబ్దం వినిపించినా వేరొక ప్రదేశానికి తరలిపోతాయి. కానీ మకర, కచ్చప నిధులు ఓకే చోట స్థిరంగా ఉంటాయి. మకర, కచ్చప్ప నిధులను పొందాలనుకుంటే అది శివానుగ్రహంతో మాత్రమే సాధ్యం అవుతుంది. శంఖ, పద్మ నిధులు పొందాలనుకుంటే విష్ణు, శివ, అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే సాధ్యం అవుతుంది.
ఇకపోతే కాకులు, డేగలు, కొంగలు వంటి పక్షులు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో నిధులు ఎక్కువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చే చోట, కాకులు సంభోగం చేసే చోట నిధులు ఉంటాయని చెబుతారు. అంతే కాదు పురాతన దేవాలయాలు, పాడుబడిన చెరువులు, ఎన్నిసార్లు పశువులు గడ్డిమేసినా తెల్లవారే సరికి గడ్డి మొలిచే స్థలంలో నిధి ఉన్నట్టు చెబుతుంటారు.
ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో ఉండే నవనిధులను, శ్రీవారి హుండీ సంపదలు శంఖనిధి, పద్మనిధి అనే దేవతలు కాపాడతారట. ఆలయానికి ఉత్తర భాగాన కుడి వైపున చేతుల్లో పద్మాలతో పద్మనిధి, దక్షిణ దిశలో ఎడమవైపు చేతుల్లో శంఖాలతో శంఖనిధి దేవతలు వెలిశారు. శ్రీవారి ఆలయ మహాద్వారానికి రెండు పక్కల ద్వారపాలకుల లాగా ఎత్తైన పంచలోహ విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలే శంఖనిధి, పద్మనిధి దేవతలు. ఈ దేవతలే శ్రీవారి సంపదను కాపాడతాయని చెబుతున్నారు.