- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హనుమాన్ జయంతిని ఏడాదికి ఎన్నిసార్లు జరుపుకుంటారు ?
దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో హనుమంతుడికి విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి మంగళవారం రోజున హనుమంతుడిని తప్పకుండా పూజిస్తారు. పాజిటివ్ ఎనర్జీకి హనుమంతుడు మారుపేరు. పిల్లల నుంచి పెద్దల వరకు హనుమంతుడిని ఇష్టపడతారు. ఆయన కథలను గాథలుగా చెప్పుకుంటారు. రామాయణంలో లంకను గడగడలాడించిన ధీశాలి పవనపుత్రుడు. హనుమంతుడి జయంతిని దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే, హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు జరుపుకుంటారు. ఎందుకో తెలుసుకుందాం...
హనుమాన్ జయంతి అంటే హిందూవులకు పెద్ద పండగే. ఆరోజున జరిగే హనుమాన్ శోభాయాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రామచంద్ర హనుమాన్‌కి జై... శ్రీరామధూత హనుమాన్‌కి జై అంటూ నినాదాలు చేస్తూ స్వామివారిని తలచుకుంటారు. అయితే, హిందూమతంలో అన్ని దేవుళ్ల జయంతి వేడుకలు ఒకసారి జరుపుకుంటే, హనుమంతుడి జయంతి మాత్రం రెండుసార్లు జరుపుకుంటారు.
ఈ రెండు జయంతి వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు శ్రీరాముని ధూత. అంతేకాదు ఆయన్ను తన గుండెల్లో పెట్టుకొని పూజించే భక్తుడు కూడా. శ్రీరామ భక్తుల్లో హనుమంతుడిదే ప్రధమస్థానం. సీతాదేవి జాడను కనుగొని రాముడి బాధను తొలగించాడు. అసురాసుల నిలయమైన లంకానగరాన్ని దహనంగావించి భూతప్రేత పిశాచాలను భయపెట్టాడు. అందుకే ఆయన్ను కొలిస్తే బాధలు తీరిపోతాయని, కష్టాలనుంచి గట్టెక్కిస్తాడని, భయాందోళనలు పోగొడతాడని భక్తులు నమ్ముతారు.
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్ధశి రోఉన స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఆ తేదీని హనుమంతుడి జన్మదినంగా జరుపుకుంటారు. అయితే, చైత్రమాసం పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకోవడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది.
హనుమంతుడు జన్మతహా అద్భుతమైన శక్తులు కలిగిఉన్నాడు. బాల్యంలో సూర్యుడిని చూసి పండు అనుకొని తినడానికి వెళ్లగా, ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని దండిస్తాడు. తన కుమారుడిని దండించిన సంగతి వాయుదేవుడికి తెలుస్తుంది. ఆయన ఆగ్రహించి ఉగ్రరూపం దాల్చి గాలిని నిలిపివేస్తాడు. దీంతో భూమండలంపై ఉన్న జీవులు గాలిలేక అల్లాడిపోతాయి. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ... వాయుదేవుడి కోపాన్ని చల్లారుస్తాడు. హనుమంతుడికి తిరిగి ప్రాణం పోస్తాడు. చైత్రమాసంలోని పౌర్ణమి రోజున ఈ సంఘటన జరిగింది. హనుమంతుడు తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించిన రోజు కావడంతో... ఆరోజున కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.