Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

by D.Reddy |   ( Updated:2025-03-08 15:49:17.0  )
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఏడుకొండల స్వామిని 67,127 మంది భక్తులు దర్శించుకోగా, 22,910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రేపు ఆదివారం కావటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Read Also..

Tirumala:శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలకు స‌ర్వం సిద్ధం.. ఆ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు

Next Story

Most Viewed