మకరరాశిలో గ్రహాల కలయిక వల్ల ఆ రాశుల వారికి లాభాలే.. లాభాలు!

by Prasanna |   ( Updated:2024-02-23 04:15:28.0  )
మకరరాశిలో గ్రహాల కలయిక వల్ల ఆ రాశుల వారికి లాభాలే.. లాభాలు!
X

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల కలయిక కొన్నిసార్లు అనుకూలంగానూ, మరి కొన్నిసార్లు ప్రతికూలంగానూ ఉంటుంది. శుక్రుడు ఇటీవల మకరరాశిలోకి ప్రవేశించాడు. కుజుడు ఇప్పటికే ఇదే రాశిలో ఉన్నాడు. మకరరాశిలో మార్చి 7 వరకు శుక్రుడు, మార్చి 15 వరకు కుజుడు ఉంటారు. మకరరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఆ రాశుల వారికి లాభాలే లాభాలు. ఈ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేషరాశి

కుజుడు, శుక్రుడు కలయికతో ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది. ఈ సమయంలో అంగారకుడు ఉచ్ఛస్థితిలో ఉండి రుచక్ మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దీంతో ఈ రాశి వారికి లాభాలు పెరుగుతాయి. అంతే కాకుండా, ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి

ఈ రెండు గ్రహాల కలయిక కర్కాటక రాశిలోని ఏడవ ఇంట్లో జరుగుతుంది. మీ ప్రేమ సఫలమవుతుంది. దీంతో వ్యాపారులు లాభపడతారు. కొత్తగా ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. అంగారక గ్రహం యొక్క శుభ దృష్టి మీ సంపదను పెంచుతాయి. ఈ సమయంలో, మీ భావోద్వేగాలను నియంత్రించడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed