భగవంతునికి నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..

by Sumithra |   ( Updated:2023-12-08 03:36:32.0  )
భగవంతునికి నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..
X

దిశ, వెబ్ డెస్క్ : హిందూ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు మన భారత దేశం. ఏదైనా పండుగ వచ్చినా లేదా ఇంట్లో శుభకార్యాలు జరిగినా, దేవాలయాలకు వెళ్లినా భగవంతునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తుంటాం. పూలు, పండ్లు, కొబ్బరికాయ, సుగంధ ద్రవ్యాలను దైవానికి సమర్పిస్తాం. అసలు భగవంతునికి నైవేద్యం ఎందుకు సమర్పించాలి, ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తియ్యని పదార్థాలు..

భగవంతునికి పూజాదికైకర్యాలు నిర్వహించినప్పుడు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. అందులోనూ పొంగలి, సిరా, లడ్డు, చెక్కర, బెల్లం లాంటి తీపి వస్తువులను నివేదిస్తారు. వీటిని నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

సుగంధ ద్రవ్యాలు..

జీవితంలో ఎక్కువగా కష్టాలను ఎదుర్కొనే వారు, కష్టమైన సమయాన్ని అనుభవించేవారు ఎప్పుడెప్పుడు కష్టాల నుంచి బయటికి వస్తామా అని చూస్తుంటారు. దానికోసం రాహు, కేతువులను పూజలు చేస్తారు. అలాగే శివలింగానికి శనివారం మసాలాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. లక్ష్మీదేవి, ఆంజనేయుడికి పూజలు చేసేటప్పుడు లవంగాలను నైవేద్యంగా నివేదిస్తారు. అలా చేయడం ద్వారా వారి కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కొబ్బరికాయ..

పూజల్లో నివేదించే నైవేద్యాల్లో కొబ్బరికాయ ఎంతో ముఖ్యమైనది. ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, దేవాలయాలకు వెళ్ళినా కొబ్బరికాయ కొడతారు. దేవతల అనుగ్రహం పొందాలన్నా, దైవం శాంతించాలన్నా కొబ్బరికాయను ఖచ్చితంగా సమర్పించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే పండ్లను నివేదిస్తే మానసికంగా బలం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed