- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Arjunudu: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం శివుడు, అర్జునుడికే ఎందుకు ఇచ్చాడో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్ : శివరాత్రి రోజున ఆ పరమ శివుడు ( Mahadev ) ఘనంగా పూజలు అందుకున్నాడు. అయితే, ఈ సమయంలో భక్తులు పురాణగాథలను చదువుతుంటారు. ఇందులో అర్జునుడు, శివుడి మధ్య జరిగిన యుద్ధం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
పాండవులు ( pandavulu ) , అర్జునుడును ( Arjunudu ) బహిష్కరించబడినప్పుడు ఆయుధాలను పొందటానికి తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల మీద గెలిచేందుకు అత్యున్నత శక్తిని పొందాలని అర్జునుడు లక్ష్యంగా పెట్టుకుంటాడు. హిందూ పురాణాల ప్రకారం, అర్జునుడు హిమాలయాలలో శివుని కోసం తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన ఆ పరమేశ్వరుడు అతన్ని పరీక్షించాలనుకుంటాడు. దీంతో, శివుడు వేటగాడు రూపంలో అర్జునుడు ముందుకు వస్తాడు. ముందుగా, అతని దగ్గరకు ఒక అడవి పందిని పంపుతాడు. అయితే, ఇద్దరూ ఒకేసారి ఆ పందిపై బాణాలు వేసి చంపేస్తారు. కానీ, ఒక బాణం మాత్రం బయటకు వస్తుంది. నా బాణమే చంపిందంటూ ఇద్దరూ గొడవ పడతారు. ఈ వివాదం పెద్దదిగా మారి వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిలే చేస్తుంది.
అర్జునుడి ( Arjunudu ) వద్ద ఉన్న బాణాలు మొత్తం అయిపోతాయి. ఎంత ప్రయత్నించినా శివుడిని ఏం చేయలేక అర్జునుడు కోపంతో తన కత్తిని తీసుకొని వేటగాడి తలపై విసురుతాడు. అది కూడా ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఇక ఇలా కాదులే అని చెట్లు, బండరాళ్లతో మళ్ళీ పోరాడుతుంటాడు. అయినా కూడా గెలవలేదు .. చివరికి శివుడి చేతిలో తీవ్రంగా దెబ్బలు తింటాడు. కొద్దిసేపటికి అర్జునుడు మూర్ఛపోతాడు. స్పృహలోకి వచ్చాక మట్టితో శివలింగాన్ని తయారు చేసి మహాదేవుడికి పూజలు చేస్తుంటాడు.
ఇతను సాధారణ మనిషి కాదని గ్రహించి, ఆ మహాదేవ్ ని పూజించి, పూల దండను వేయగా.. అది ఆశ్చర్యకరంగా వేటగాడి మెడలో పడుతుంది. అప్పుడు, అర్జునుడుకు మొత్తం అర్ధమవుతుంది. వెంటనే అర్జునుడు, శివుని పాదాలపై పడి క్షమించమని కోరతాడు. అతని భక్తిని మెచ్చిన శివుడు అతనికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధమైన పాశుపతాస్త్రాన్ని ( Pashupatastra ) ఇచ్చాడు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.