- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వారంలో ఏ రోజున.. ఏ వస్తువులు దానం చేయాలో తెలుసా..

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక గ్రహం లేదా దేవుళ్లకి అంకితం చేశారు. వారంలోని రోజులన్నీ స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో దానం, ఉపవాసాలకు విశేష ఫలితాలను ఇస్తుంది. హిందూమతం ప్రకారం దానం చేయడం వలన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
అయితే దానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే ఆ నియమాల గురించి చాలా మందికి తెలియదు. ఉప్పు, పంచదార, బట్టలు మొదలుకొని నగలు వరకు వివిధ వస్తువులను దానం చేయడానికి శాస్త్రాలలో, వారంలోని ఏడు రోజులు నిర్దేశించారు. అయితే ఏ రోజున ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం ఏమి దానం చేయాలి ?
ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించినది. సూర్యభగవానున్ని గ్రహాలకు రాజు అంటారు. ఈ రోజున మీరు గోధుమలు, ఎర్రటి పువ్వులు, బెల్లం, రూబీ రత్నం మొదలైన వాటిని దానం చేయాలి. ఆదివారం రోజున ఈ వస్తువులను దానం చేయడం ద్వారా, మీరు కీర్తి, గౌరవాన్ని పొందుతారు.
సోమవారం ఏమి దానం చేయాలి ?
సోమవారం శివుడు, చంద్రదేవునికి సంబంధించినది. ఈ రోజున మీరు బియ్యం, తెల్లని బట్టలు, తెల్లటి పువ్వులు, పంచదార, కొబ్బరి మొదలైన తెల్లని రంగు వస్తువులను దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. చంద్రుడు కూడా జాతకంలో బలంగా ఉంటాడు.
మంగళవారం నాడు ఏమి దానం చేయాలి ?
హనుమంతుని ఆరాధనకు మంగళవారాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున చేసే దానం అంగారక గ్రహాన్ని బలపరుస్తుంది. మంగళవారం నాడు ఎర్రపూలు, ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, బాదం, రాగి పాత్రలు దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
బుధవారం ఏమి దానం చేయాలి ?
గణేశుడిని బుధవారం పూజిస్తారు. ఈ రోజు బుధ గ్రహానికి సంబంధించినది. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి. బుధవారం నాడు పేదలకు, నిరుపేదలకు ఆకుపచ్చ పెసరు పప్పు, పచ్చి కూరగాయలు, ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ బట్టలు మొదలైనవి దానం చేయండి.
గురువారం నాడు ఏమి దానం చేయాలి?
గురువారం విష్ణువు, బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. ఈ రోజు పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది సంపద, శ్రేయస్సు, కీర్తిని తెస్తుంది. పసుపు పప్పులు, పసుపు బట్టలు, పసుపు పువ్వులు, పసుపు పండ్లు, బెల్లం, బంగారు వస్తువులను గురువారం దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల జాతకంలో గురు గ్రహం బలపడుతుంది.
శుక్రవారం ఏమి దానం చేయాలి ?
శుక్రవారం లక్ష్మీ దేవత, శుక్రుడికి అంకితమైనదిగా పరిగణిస్తారు. శుక్రవారం తెల్లవారుజామున దానం చేయాలని చెప్పారు. ఈ రోజున ఉప్పు, ఖీర్, వస్త్రాలు, కుంకుమపువ్వు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపాదన కలిగిస్తుంది.
శనివారం ఏమి దానం చేయాలి ?
శనివారం శనిదేవునికి అంకితం చేశారు. శనిదేవుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం, కాబట్టి మీరు శనివారం నాడు నలుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఈ రోజున నల్లని వస్త్రాలు, ఇనుము, ఆవనూనె, నల్ల నువ్వులు, తోలు వస్తువులు దానం చేయాలి.