ఆ అమ్మవారికి చిన్న పిల్లల తినుబండారాలే నైవేద్యం.. ఎక్కడో తెలుసా..

by Sumithra |
ఆ అమ్మవారికి చిన్న పిల్లల తినుబండారాలే నైవేద్యం.. ఎక్కడో తెలుసా..
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఆలయాలలో దేవుళ్లకి నైవేద్యంగా దద్దోజనం, చక్కెర, శనిగల ప్రసాదం, పరమాన్నం, పులిహోర, లడ్డూ వంటివాటిని నివేదిస్తారు. లేదా టెంకాయలను కొట్టి నివేదిస్తారు. కానీ కొన్ని ఆలయాలలో మాత్రం దేవుళ్లకి మాంసం, మద్యం లాంటి వాటిని నైవేద్యంగా పెడతారు. కానీ ఓ ఆలయంలో మాత్రం అమ్మవారికి చిన్న పిల్లలు తినే తినుబండారాలను నైవేద్యంగా పెడతారు. వింటుంటే కాస్త వింతగా అనిపిస్తుంది కదా. కానీ అది నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఏ అమ్మవారికి తినుబండారాలను నైవేద్యంగా పెడతారో తెలుకుందాం..

గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో జీవంతికా అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 51 ఏళ్ల చరిత్ర ఉంది. అబేలాల్ దబే అనే వ్యక్తి ఈ ఆలయాన్ని స్వయంగా నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజారి ఉండడు, అలాగే హుండీలు కూడా ఉండవు. అందుకే ఇక్కడికి వెళ్లిన భక్తులు వారే స్వయంగా అమ్మవారికి నైవేద్యం పెడతారట. జీవంతికా ఆలయానికి వచ్చిన భక్తులు శాండ్‌విచ్, చాక్లెట్స్, క్రీమ్‌రోల్, కూల్‌డ్రింక్, పిజ్జా, బర్గర్, బిస్కెట్స్, పానీ పూరీ ఇలా చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే తినుబండారాలను నైవేద్యంగా పెడతారు. విదేశాలలో ఉండే చాలా మంది భక్తులు పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్, చాక్లెట్స్, బిస్కెట్స్ ప్యాకెట్లను అమ్మవారికి ప్రసాదంగా పెట్టటానికి పంపిస్తుంటార. ఆ తరువాత వాటినే భక్తులకు ప్రసాదాలుగా ఇస్తారు. అందుకే ఈ ఆలయానికి చిన్నపిల్లలు రావడానికి ఎంతగానో ఇష్టపడతారట. అంతే కాదు ఈ ఆలయంలో చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆహార పదార్థాలను తయారు చేసి చిన్నారులకు పంచుతుంటారట.


Next Story