Tathastu Devatas : త‌థాస్తు దేవ‌త‌లు నిజంగా ఉన్నారా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?

by Prasanna |   ( Updated:2025-02-16 03:45:57.0  )
Tathastu Devatas : త‌థాస్తు దేవ‌త‌లు నిజంగా ఉన్నారా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే, పైన దేవతలు త‌థాస్తు అంటే ఇక అంతే సంగతని పెద్దలు కూడా చెబుతారు. అయితే, చాలా మందికి ఒక సందేహం ఉంది నిజంగానే త‌థాస్తు దేవతలు ఉన్నారా..? లేరా అని..! అసలు ఆ దేవ‌త‌లు ఎవ‌రు..? ఏ స‌మ‌యంలో తిరుగుతారు..? దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

పురాణాల ప్ర‌కారం, త‌థాస్తు దేవ‌త‌లు ఉన్నారనే చెబుతున్నాయి. త‌థ‌ అంటే ఆ విధంగా, అస్తు అంటే జ‌ర‌గాల్సిందే అని అర్థం వస్తుంది. మ‌నిషి మంచి మాట్లాడినా .. చెడు మాట్లాడినా త‌థాస్తు దేవ‌త‌లు త‌థాస్తు అంటారు. వాళ్ళు ఒక్కసారి అలా అనగానే అవి కచ్చితంగా జరుగుతాయి. సూర్యుని భార్య, సంధ్యా దేవి సూర్యుని వేడిని భ‌రించ‌లేక గుర్రం అవతరమెత్తి వెళ్తూ ఉంటుంది. గుర్రం రూపంలో ఉన్న అతని భార్యని చూసి సూర్యుడు కూడా గుర్రంలా మారి ఆమె వద్దకు వెళ్తాడు. ఇలా వీరిద్ద‌రి క‌ల‌యిక వల్ల పుట్టిన సంతానమే త‌థాస్తు దేవ‌త‌లు.

వీరు అతి వేగంగా ప్ర‌యాణిస్తూ ఉంటారు. కన్ను మూసి తెరచిలోపే కంటికి కూడా కనిపించరు. వీరు ప్ర‌యాణించే మార్గంలో త‌థాస్తు అనుకుంటూ వెళ్తుంటారు. య‌జ్ఞాలు, యాగాలు జ‌రిగే చోట ఎక్కువగా ఉంటారు. వీరికి మంచి కోరుకునే వారంటే చాలా ఇష్టమట. ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని, ఇంకో చేతిలో అభ‌య హ‌స్తాన్ని పట్టుకుని ప్రయాణిస్తారు. త‌థాస్తు దేవతలు సంధ్యా స‌మ‌యంలో.. అంటే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు తిరుగుతూ ఉంటార‌ని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి, ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే జరుగుతాయని పండితులు కూడా చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed