గుడి ఆవరణలో ఇతరులకు పాదాభివందనం అసలు చేయొద్దు.. ఎందుకంటే

by Kalyani |   ( Updated:2023-07-04 06:35:38.0  )
గుడి ఆవరణలో ఇతరులకు పాదాభివందనం అసలు చేయొద్దు.. ఎందుకంటే
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయులకు రకరకాల నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా హిందువులు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. ఒక్కొక్కరూ ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. హిందువులకు చాలా విశ్వాసాలుంటాయి. అయితే మనం ఏ గుడికైనా వెళ్లినప్పుడు గుడిలోకి దేవుడితో సమానమైన వ్యక్తి వచ్చిన సరే మనం వారి కాళ్లకు దండం పెట్టకూడదని పెద్దలు చెబుతుంటారు.

అలా చేస్తే దేవుడినే అవమానించనట్లవుతుందట. దేవాలయ ఆవరణం నుంచి బయటకు వచ్చేంతవరకు పోటోలు తీసుకోకూడదు. ఎవరికి పాదాభివందనం చేయకూడదు. అంతగా మనకు ఎవరైనా తెలిసిన వాళ్లు, పలకరించకపోతే బాధ పడతారేమో అనుకుంటే దూరం నుంచే నమస్కారం చేయాలి. అంతేగాని పాదాభివందనం చేయకూడదు.

Read More: వాటర్ బాటిళ్ల పై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు ఉంటుంది..? ఇదే కారణం!

మనదేశంలో ఐదు మిస్టరీ ఆలయాల గురించి మీకు తెలుసా... అవి ఏంటంటే..!

Next Story