- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ayodhya: అయోధ్య రామమందిరంలో సొరంగం నిర్మాణం.. ఎందుకంటే?

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య (Ayodhya) రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆలయ నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఎక్కడా ఇనుము వాడకుండా అత్యున్నత ప్రమాణాలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని తగ్గించేందుకు కొత్తగా సొరంగ మార్గం నిర్మించారు. ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య రద్దీ తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేల మట్టానికి దీనిని నిర్మించారు.
దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవున్న ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు భక్తులు ప్రదక్షిణలు చేయవచ్చు. దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించిన అతి పెద్ద సొరంగం ఇదేనని అధికారులు చెబుతున్నారు. ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మించే ప్రాజెక్టులో సొరంగం ఓ భాగమని వెల్లడించారు. అక్టోబరు నాటికి సొరంగం పనులు 100 శాతం పూర్తవుతాయని తెలిపారు. ఇక ఆలయ సింహద్వారంలోకి భక్తులు ప్రవేశించగానే తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా వెళితే నేరుగా ఆలయంలోకి వెళ్లొచ్చు. దాని పక్కనే బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది. ఈ ద్వారంలో వెళితే సొరంగ మార్గం ద్వారా బయటకు వెళతారు. ఈ సొరంగాన్ని ప్రవేశ మార్గం కిందనే నిర్మించారు.