- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడి గది శుభ్రం చేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఎందుకంటే?
దిశ, ఫీచర్స్: ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం ఈ రోజునే ప్రారంభమవుతుంది.ఈ రోజు మనం ఏ పని చేసినా.. ఏడాది పొడవునా అలాంటి ఫలితాలు సాధిస్తామని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దేవుడి గది శుభ్రం చేసేటప్పుడు.. ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటో ఇక్కడ చూద్దాం..
ముఖ్యంగా ఉగాది రోజున చాలా మంది తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. అలాగే కొన్ని ఇళ్లలో దేవుడి గది ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడి గుడి శుభ్రం చేసేటప్పుడు గుడిలోని దేవుడి విగ్రహాలను జాగ్రత్తగా వేరే ప్రదేశంలో పెట్టాలి. ఆ తర్వాత స్నానం చేసి దేవుని గదిని శుభ్రం చేయాలి. ఎక్కడ కూడా బూజు లాంటివి ఉండకుండా క్లీన్ చేసుకొవాలి. కొందరైతే దేవుడికి పెట్టిన పూలను కొద్దిరోజులపాటు తీయకుండా అలాగే ఉంచుతారు. ఇలా చేస్తే.. ప్రతికూల శక్తి మీ ఇంటి లోపలి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. అదే విధంగా ముందుగా దేవుని విగ్రహాన్ని చింతపండు లేదా నిమ్మకాయతో శుద్ధి చేయాలి.
దేవతా గుడిలో ప్రత్యేకంగా పంచపాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు దేవతలకు సమర్పించే కుంకుమ, పసుపును విడిగా పెట్టుకోవాలి. అలాగే మనం బొట్టుపెట్టుకునేవి దేవుడికి మళ్లీ ఉపయోగించకూడదు. దేవుడి గదిలో ఎక్కువగా పటాలు పెట్టుకోకుండా దేవుళ్లు తక్కువగా ఉన్న పూజలు భక్తితో కొలవాలి.