- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Basara: బాసర క్షేత్రంలో భక్తజన సందోహం.. ‘కాళరాత్రి దేవి’గా దర్శనమిచ్చిన అమ్మవారు
దిశ, వెబ్‌డెస్క్: దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా (Nirmal District)లోని బాసర (Basara) జ్ఞాన సరస్వతి దేవి (Gnana Saraswathi Devi) ఆలయానికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయదశమి సెలవుల నేపథ్యంలో స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ‘కాళరాత్రి దేవి’ (Kalarathri Devi) అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఓ వైపు ఆర్జిత సేవలను కొనసాగిస్తూనే ఆలయ అర్చకులు, వేద పండితులు జ్ఞాన సరస్వతి దేవికి మూలా నక్షత్ర (Moola Nakshatram) అష్టోత్తరనామార్చన పూజా క్రతువును కొనసాగిస్తున్నారు.
అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వహకులు, పోలీసు సిబ్బంది దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసానికి జ్ఞాన సరస్వతి ఆలయం ప్రసిద్ధి కావడంతో తల్లిదండ్రులు చిన్నారులకు అక్కడే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Read More..
- Tags
- Basara Temple