Bansi Narayan Temple : రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఆ రహస్యం ఏంటో తెలుసా ?

by Sumithra |
Bansi Narayan Temple : రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఆ రహస్యం ఏంటో తెలుసా ?
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు. ఒక్కో ఆలయంలో ప్రత్యేకమైన ఆచారాలు, నమ్మకాలకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్టత ఉన్న దేవాలయాల్లో ఉత్తరాఖండ్‌ చెందిన ఈ ఆలయం కూడా ఉంది.

ఉత్తరాఖండ్‌లోని బన్సి నారాయణ్ ఆలయం హిమాలయాల ఒడిలో ఉన్న ఆలయం. ఇది దాని ప్రత్యేకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి అంటే రక్షాబంధన్ రోజున మాత్రమే తెరుచుకుంటాయి. ఈ కారణంగా ఇది రహస్యమైన, పవిత్రమైన తీర్థంగా పరిగణిస్తారు. ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజున ఇక్కడికి వచ్చి పూజలు చేయడం వలన విశేష పలితాలు అందుతాయంటున్నార పండితులు. ఈ రోజు విష్ణువు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి ఆవష్యకత ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ రోజున ఇక్కడ చేసే పూజలు, దర్శనాలు ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. రక్షాబంధన్ రోజున, దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో క్యూలు కడతారు.

వంశీ నారాయణ దేవాలయం.. ఉత్తరాఖండ్...

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉర్గామ్ లోయలో ఉన్న బన్షి నారాయణ్ ఆలయంలో నారాయణుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. అయితే ఈ ఆలయంలో శివుడు, నారాయణ (శ్రీ కృష్ణుడు ) విగ్రహాలు ప్రతిష్టించి ఉన్నాయి. ఈ ఆలయాన్ని బన్సీ నారాయణ్, వంశీ నారాయణ్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం లోపలి నుండి కేవలం 10 అడుగుల ఎత్తు మాత్రమే. ఇక్కడి పూజారులు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ నాడు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆలయానికి సమీపంలో ఒక ఎలుగుబంటి గుహ కూడా ఉంది. ఈ గుహలో భక్తులు ప్రసాదం చేస్తారు. రక్షాబంధన్ రోజున ప్రతి ఇంటి నుంచి వెన్న వస్తుందని, దానిని ప్రసాదంలో కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతారని చెబుతారు.

ఈ ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు..

మానవ నివాసాలకు దూరంగా, పర్వతాల అందమైన దృశ్యాలు ఇక్కడ నుండి కనిపిస్తాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా వెళ్లాలి. ఈ ఆలయాన్ని 6 నుంచి 8వ శతాబ్దాల కాలంలో నిర్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

రక్షాబంధన్ కు భక్తుల రద్దీ..

రక్షాబంధన్ రోజున వంశీ నారాయణ ఆలయంలో సోదరీమణులు రాఖీ కడితే సోదరులకు సంతోషం, శ్రేయస్సు, విజయాలు పొందుతారని, వారి సోదరుల వచ్చే అన్ని కష్టాలు తొలగిపోతాయని అక్కడి భక్తులు నమ్ముతారు. అందుకే, రక్షాబంధన్ రోజున ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజ అనంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించడంతో, మరుసటి రక్షాబంధన్ వరకు ఆలయ తలుపులు మళ్లీ మూసివేస్తారు.

ఆలయానికి సంబంధించిన పౌరాణిక కథ..

వంశీ నారాయణ ఆలయానికి సంబంధించి ఒక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ ప్రకారం విష్ణువు తన వామనవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశంలో నారదుడు మునీంద్రుడు నారాయణుడిని పూజించాడని నమ్ముతారు. అప్పటి నుండి నారదుడు సంవత్సరంలో 364 రోజులు ఇక్కడ విష్ణుమూర్తిని పూజిస్తాడని, ఒక రోజు మాత్రమే పూజ చేయకుండా విడిచిపెడతాడని నమ్ముతారు. తద్వారా భక్తులు ఇక్కడ నారాయణుడిని కూడా పూజించవచ్చు. ఈ కారణంగా, ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రక్షాబంధన్ రోజున తెరుచుకుంటాయి.

Next Story

Most Viewed