Eclipse 2025: ఈ నెలలో ఏర్పడనున్న సూర్య, చంద్ర గ్రహణాలు.. జాగ్రత్తగా ఉండాలంటున్న జ్యోతిష్యులు

by Phanindra |
Eclipse 2025: ఈ నెలలో ఏర్పడనున్న సూర్య, చంద్ర గ్రహణాలు.. జాగ్రత్తగా ఉండాలంటున్న జ్యోతిష్యులు
X

దిశ, వెబ్ డెస్క్ : హిందూ సంప్రదాయాల్లో గ్రహణ కాలాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి పూజలు, మంచి పనులను మొదలుపెట్టరు. గత వేల సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. అంతేకాదు, గ్రహణ సమయంలో పెళ్లిళ్లు కూడా చేయరు. గ్రహణం పట్టే సమయంలో శక్తివంతమైన మంత్రాలను జపిస్తూ ఉంటారు . ఇలా చేయడం వలన సానుకూలంగా ఉంటుంది. అయితే, 2025 లో రెండు గ్రహణాలు ఈ నెలలోనే ఏర్పడనున్నాయి.

మార్చి 14న మొదటి చంద్రగ్రహణం ( chandra grahan )

2025లో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాల , రెండు చంద్ర గ్రహణాలు. అయితే, వీటిలో ఒకటి మాత్రమే మన దేశంలో కనిపిస్తుంది. మిగిలినవి భారతదేశంలో కనిపించవని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నెల14న పౌర్ణమి తిధి రోజున చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో చంద్రగ్రహణం ఏర్పడే సమయం ఉదయం. కాబట్టి, ఇది మన ప్రజలకు కనిపించదు. అమెరికా, పశ్చిమ యూరప్, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.

మార్చి 29న మొదటి సూర్యగ్రహణం ( surya grahan)

ఇదే నెలలో సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకి సూర్య గ్రహణం మార్చి 29 న అమావాస్య రోజున ఏర్పడనుంది. అయితే, సూర్య గ్రహణం కూడా మన దేశ ప్రజలకు కనిపించదు. ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, యూరప్ ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది.

అయితే, ఎన్నడూ లేని విధంగా రెండు గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడటం వలన ప్రజలపై కొంత ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, గర్భిణీలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు. అలాగే, గ్రహణం పూర్తిగా అయిపోయిన తర్వాత తల స్నానం చేసి భోజనం చేయాలనీ చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.



Next Story