Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో ఆంజనేయస్వామి.. ఆ భంగిమలకు అర్థమేంటో తెలుసా?

by D.Reddy |
Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో ఆంజనేయస్వామి.. ఆ భంగిమలకు అర్థమేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యేక్ష దైవం ఆ తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు (Devotees) తరలి వస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది కాలినడకన వెళ్లి శ్రీవారి మొక్కులు చెల్లించుకుంటారు. గతంలో తిరుమలకు చేరుకునేందుకు ఏడెనిమిది కాలినడక మార్గాలు ఉండేవని చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం రెండు మార్గాలే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా అలిపిరి (Alipiri) మెట్ల మార్గం నుంచే భక్తులు కాలినడక వెళ్తుంటారు. ఇక ఈ మార్గంలో వెళ్లే భక్తులకు మధ్య మధ్యలో చిన్న చిన్న కొండలపై ఆంజనేయస్వామి వివిధ భంగిమల్లో ఉన్న విగ్రహాలు తరసపడుతుంటాయి. కానీ, ఆ భంగిమలకు అర్థం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో హనుమంతుడు భక్తులకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాం.

తిరుమలలో పూర్వం నుంచి అలిపిరి మెట్ల మార్గమే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుంచి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. ఇక అలిపిరి నుంచి తిరుమల వరకు మొత్తం 3,550 మెట్లు ఉంటాయి. ప్రతి 500 మెట్లకు ఒక ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఒక్కో విగ్రహం ఒక్కో భంగిమలో ఉంటుంది.

ఇక పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీగా ఉండేది. స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ అటవీ మార్గంలోనే వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే భక్తులు అడవిలో తప్పిపోకుండా స్వామివారి చెంతకు సులువుగా చేరుకునేలా హనుమంతుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామి హస్తం చూపించిన వైపు మార్గం స్వామి వారి ఆలయం ఉంటుందని అర్థం. ఈ భంగిమలను ఆధారంగా చేసుకునే పూర్వం భక్తులు శ్రీవారిని చేరుకునే వారు.

Next Story

Most Viewed