కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత..

by Sridhar Babu |
కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత..
X

దిశ, జగిత్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానములో జూన్ మొదటి వారం జరిగే పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను అంతరంగికంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో వచ్చే నెల జరిగే ఉత్సవాలను కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జూన్ 1 నుండి 4వ తేదీ వరకు టెంపుల్‌లోనే అంతరంగికంగా అర్చకుల చేత పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందువలన అంజనేయ దేవస్థానంలో దీక్ష భక్తులకు మాల విరమణ, దర్శనాలకు అనుమతి లేదని భక్తులు కొండగట్టుకు రావొద్దని ఆలయ అర్చకులు, అధికారులు సూచించారు.

Advertisement

Next Story