శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తుల ఆందోళన

by srinivas |
శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తుల ఆందోళన
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం సామాన్య భక్తులు ఆందోళనకు దిగారు. శనివారం అలిపిరి భూదేవి కాంప్లెక్స్​వద్ద భక్తులు తెలవారుజామున బారులు తీరారు. అప్పటికే ఉచిత టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి టోకెన్లు జారీ చేయడం వల్ల కోటా పూర్తయిందని సిబ్బంది చెప్పారు. రాత్రి 12 గంటల నుంచి ఇవ్వాల్సిన టోకెన్లను 10గంటలకు ఎలా ఇస్తారని భక్తులు నిలదీశారు. ఉదయాన్నే అక్కడకు చేరుకున్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని ఇదే విషయమై నిలదీశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారికి టోకెన్లు జారీ చేయాలని ధర్మారెడ్డి ఆదేశించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉచిత దర్శనం టోకెన్లను కొనసాగించడం కష్టమవుతోందని ఈసందర్భంగా ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. త్వరలో ఈవో, చైర్మన్‌తో మాట్లాడి టోకెన్ల జారీ నిలిపివేయడంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed