- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు
దిశ, చార్మినార్: దీపావళి ఉత్సవాల్లో భాగంగా చార్మినార్శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రముఖులతో చార్మినార్పరిసరాలు సందడిగా మారాయి. వేలాదిమంది భక్తులతో చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ ట్రస్టీ చైర్మన్శశికళ ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకోసం ఒక్క గ్రాము వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన నాణంపై ఒకవైపు భాగ్యలక్ష్మి అమ్మవారి ప్రతిమ, మరోవైపు చారిత్రాత్మక చార్మినార్‌ను ముద్రించారు. ఈ ఏడాది తొమ్మిది కిలోల వెండితో 90 వేల నాణాలతో పాటు అల్యూమినియంతో తయారైన నాలుగున్నర లక్షల నాణాలను కూడా ముద్రించారు. ఈ నాణాలను దీపావళి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా 5.40లక్షల నాణాలతో అమ్మవారికి పూజలు చేసిన అనంతరం గురువారం రాత్రి 7గంటల నుంచి అమ్మవారి ఖజానాను భక్తులకు అందజేస్తున్నారు. చార్మినార్ నుంచి గుల్జార్హౌజ్వరకు మూడు క్యూలైన్‌లలో భక్తులు భారీగా క్యూకట్టారు.
భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసిన గుల్జార్ హౌజ్వైపు మూడు క్యూలైన్‌లు, ప్రముఖుల కోసం మక్కా మసీదు వైపు మరో క్యూలైన్ ఏర్పాటు చేయగా, భక్తులు బారులుతీరారు. ఇప్పటి వరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించిన ప్రముఖులలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రులు చెన్నబోయిన కృష్ణాయాదవ్, బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, హైదరాబాద్కలెక్టర్ శర్మన్, ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, పద్మావతి దంపతులు, వీహెచ్‌పీ నేత శ్యాం, వివిధ పార్టీల నేతలు రాపోలు భాస్కర్, చింతల రాంచంద్రారెడ్డి, ఎల్.వీ రమణ, జనార్థన్, దైవాజ్ఞ శర్మ, డాక్టర్ లక్ష్మణ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్శ్రీలత శోభన్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.