అభిమానులకు వేల వేల దండాలు : దేవిశ్రీ

by Shyam |   ( Updated:2023-10-10 15:16:46.0  )
అభిమానులకు వేల వేల దండాలు : దేవిశ్రీ
X

దిశ, సినిమా : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మాస్ బీట్స్, యూత్‌ఫుల్ కంపోజిషన్‌తో ప్రతీ సినిమాకు వేరియేషన్ చూపించే దేవి.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీలో దేవిశ్రీ కంపోజ్ చేసిన సీటీమార్ సాంగ్.. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్‌ 100 మిలియన్ వ్యూస్‌‌తో రికార్డ్ సృష్టించింది. ప్రభుదేవా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సీటీమార్ సాంగ్ సక్సెస్‌ పట్ల స‌ల్మాన్ ఖాన్‌‌తో పాటు డైరెక్టర్ ప్రభుదేవా.. రాక్‌స్టార్‌ దేవిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీటీమార్ సాంగ్‌కు సంబంధించి సల్మాన్‌, ప్రభుదేవా విజువల్స్‌తో కూడిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన దేవి.. డైరెక్టర్, హీరోతో పాటు మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక దేవి ఇదే ఊపులో త్వరలోనే రెండు భారీ బడ్జెట్ హిందీ సినిమాలకు మ్యూజిక్ అందించబోతుండగా, ఆ వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed