- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అస్తవ్యస్తంగా అభివృద్ధి పనులు
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలో అర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి పనులు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఒకటి, రెండు కాదు దాదాపు అన్ని కాలనీల్లో పనులు నిలిచిపోవడంతో సమస్య జఠిలంగా మారింది. ఇంజినీరింగ్ అధికారుల ఆలోచనలేని పనులతో అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నిలిచిన పనులను పూర్తిచేయాలని కోరుతున్నారు.
నిలిచిపోయిన పనుల వివరాలు..
కుత్బుల్లాపూర్ గ్రామం నుంచి అయోధ్యనగర్ వెళ్లే వినాయక నగర్ చౌరస్తా నుంచి రెండేళ్ల క్రితం సుమారు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు వేయించారు. కానీ, ప్రారంభంలో డ్రైనేజీ వ్యవస్థ సరిచేయకపోవడంతో నిత్యం మురుగు పారు తుంది. గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయోధ్యనగర్ నుంచి ఉషోదయ టవర్స్ వైపు వెళ్లేందుకు నాలాపై నుంచి వెళ్లాలి. కానీ, లింకు రోడ్డు పనుల కోసం మూడు నెలల క్రితం నాలా పైభాగాన్ని తవ్వి వదిలేశారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
బీరప్పనగర్ సమీపం లో ఓపెన్ నాలా పైకప్పు శిథిలమై కూలిపోయింది. అక్కడే సీసీ రోడ్డు వేసిన అధికారులు పైకప్పునకు మరమ్మతులు చేయలేదు. రాత్రి పూట వేగంగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశముంది.
పూర్తి చేయిస్తాం..
బీరప్పనగర్ లింకు రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేయిస్తాం. వినాయకనగర్ చౌరస్తాలో ఉన్న సమస్యలు నా దృష్టికి రాలేదు. పరిశీలించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.
-కృష్ణ చైతన్య, ఈఈ కుత్బుపూర్ సర్కిల్