- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బూడిదలో పోసిన పన్నీరుగా మూసీ సుందరీకరణ వ్యయం
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో మూసీని అనుసరించి ప్రభుత్వం చేసిన వ్యయం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. సుమారు నెలల క్రితం లక్షలాది రూపాయలు వెచ్చించి మూసీ నదిని అనుసరించి అధికారులు సుందరీకరించారు. ఇందులో భాగంగా వాకర్స్ ట్రాక్ నిర్మించారు . గ్రేటర్ లో మూసీ పారుతున్న ప్రాంతాలలో పూలమొక్కలు జిమ్ లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాగోల్ సమీపంలో మూసి నీటిలోకి రోడ్డు వేసి పర్ణశాల ఏర్పాటు చేశారు. దీని చుట్టూ అందమైన పూల మొక్కలు పెంచారు. అంతేకాకుండా వాకర్స్ ఇక్కడ విశ్రాంతి తీసుకునేందుకు బెంచీలు అందుబాటులో ఉంచారు. దీంతో ఇది చూడడానికి సుందర ప్రదేశంగా మారింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు లక్షలాది రూపాయలు ఏర్పాటు చేసిన ఈ ప్రదేశం పూర్తిగా దెబ్బతింది. పర్ణశాల చుట్టూ ఏర్పాటు చేసిన పూలమొక్కలు, బెంచీలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా పర్ణశాల వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయింది.
నాసిరకం పనులు..
మూసీని అనుసరించి జరుగుతున్న అభివృద్ధి పనులు నాసిరకంగా ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి . పలు చోట్ల ఏర్పాటు చేసిన జిమ్ లు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రారంభం కాకముందే చెడిపోతున్నాయి. వాకర్స్ ట్రాక్స్ కూడా వరద నీటికి కొట్టుకుని పోతోంది. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులు మూసిలో పోసిన పన్నీరుగా మారిందనే అభిప్రయాలు వ్యక్తమౌతున్నాయి.