- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి అంటే ముత్యం రెడ్డి
దిశ, దుబ్బాక :
దుబ్బాక నియోజక వర్గంలో అభివృద్ధి అంటే ముత్యంరెడ్డి.. ముత్యంరెడ్డి అంటే అభివృద్ధి అని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తన తండ్రి స్వర్గీయ ముత్యంరెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందపూర్, ఉప్పరపల్లి, గువ్వలేగి, కోనాయిపల్లితోపాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో కలిసి గ్రామాల్లో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ… రాజకీయాలను వ్యభిచారంగా మార్చిన అగ్రగామిగా హరీశ్ రావుకు అవార్డు ఇవ్వాలని అన్నారు. ఎన్ని మాయ మాటలు చెప్పినా టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. తనకు రాజకీయం అవసరం లేకున్నప్పటికీ తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికే రాజకీయంలోకి వస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తు కు ఓటేసి తనను ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపితే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక అవుతానని అన్నారు.