- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవరయంజాల్ భూముల్లో దొంగ అవతారమెత్తింది ప్రభువే..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రాన్ని పాలించే ప్రభువే దొంగ అవతారమెత్తాడని, విలువైన భూములను ఆక్రమించుకున్నాడని కాంగ్రెస్ఎంపీ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ వ్యవహారంపై స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి.. కేసీఆర్సొంత పత్రిక నమస్తే తెలంగాణకే ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, రెండు ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించుకుని ఆ పత్రికను ముద్రిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి భూ ఆక్రమణలపై మండిపడ్డారు.
కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్, నమస్తే తెలంగాణ పత్రిక పేరుమీద, కేసీఆర్ బంధువు భూంరావు పేర్లతో దేవాలయ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ సేకరించామని, త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నిషేదిత జాబితాలోని 437 సర్వే నెంబర్లో కేటీఆర్, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు భూములున్నాయని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ వ్యవహారంలో ఎంత స్పీడ్‌గా విచారణ చేశారో ఈ భూములపై కూడా అంతే స్పీడ్ తో ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ సీఎం కేసీఆర్ వేసే ఎంక్వయిరీమీద నమ్మకం లేదన్నారు.
మంత్రి మల్లారెడ్డి కూడా సర్వే నెంబర్ 658లో ఏడు ఎకరాలను ఆక్రమించుకుని విలాసవంతమైన ఫాంహౌస్‌ను నిర్మించుకున్నారన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఈ భూములు వీళ్లకు ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్లైన్లో దేవరయంజాల్ భూముల వివరాలు లేకుండా చేశారని, 1531 ఎకరాల దేవాదాయ భూములను ధరణిలో ఎందుకు హైడ్ చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో 9 జిల్లాల భూ రికార్డులు ఉన్నాయని, కానీ రంగారెడ్డి జిల్లా భూముల వివరాలు లేవని, వీటిని ఎందుకు దాచారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
1920 నుంచి 2021 వరకు 95 ఏండ్ల భూ రికార్డులను బయటకు తీయాలని, అందుకే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ భూములపై తెలంగాణ ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీలు, జేఏసీలను కలుపుకుని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తామని, అవసరమైతే టీఆర్ఎస్ నేతలు కూడా వస్తే తీసుకుపోతామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ భూముల విచారణ కమిటీలో రఘునందన్‌రావును నియమించారని, కేసీఆర్ బంధువు అయిన రఘునందన్‌రావు ఏం విచారణ చేస్తారని ప్రశ్నించారు. రఘునందన్‌రావును కమిటీలో నియమించడంతోనే సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి తేలిపోయిందని, అందుకే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ లేఖ రాయాలని సూచించారు.