సాగు నీరందించటమే లక్ష్యం

by Shyam |
సాగు నీరందించటమే లక్ష్యం
X

దిశ, నల్లగొండ: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో డిండి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనుండటంతో కాల్వలకు మరమ్మతులు పూర్తి చేయాలి అని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో చెక్ డ్యామ్స్ నిర్మాణ పనులకు టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో డిండి ఎంపీపీ మాధవరం సునీత, జనార్థన్ రావు, రైతు బంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed