ప్రాజెక్టులను నింపి రైతులను ఆదుకోండి: ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి

by Shyam |   ( Updated:2020-05-02 07:02:22.0  )
ప్రాజెక్టులను నింపి రైతులను ఆదుకోండి: ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి
X

దిశ, మహబూబ్‎నగర్: వనపర్తి జిల్లాలోని ప్రాజెక్టులను నింపి రైతులను ఆదుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌ కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా కొత్తకోట మండలంలోని శంకర సముద్రానికి సంబంధించిన కానాయపల్లి ఆర్ అండ్ ఆర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అంతేకాకుండా శంకర సముద్రాన్ని పూర్తిస్థాయిలో నింపి రైతులను ఆదుకోవాలన్నారు. అలాగే, మదనాపురం మండలంలోని సరళసాగర్ ప్రాజెక్ట్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన రజత్ కుమార్ పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. వారంలో దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటన చేస్తానని ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డికి ఆయన తెలియజేశారు.

Tags: MLA venkateshwar reddy, meet, Rajat Kumar, hyderabad

Advertisement

Next Story