‘ఆ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించండి’

by Shyam |   ( Updated:2020-09-21 02:20:37.0  )
‘ఆ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించండి’
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట జంగమాయపల్లి బ్రిడ్జిని మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మంత్రి హరీశ్ రావును కోరారు. కనిమెట్ట జంగమాయపల్లికి వంతెన లేనందున వర్షాలతో ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు పడవలో ప్రయాణం చేస్తున్నారని అన్నారు.

ఈ విషయంపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌కు వివరించానని, దీంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించారని వివరించారు. అందులో భాగంగానే సోమవారం మంత్రి హరీష్ రావుని కలిసి కనిమెట్ట-జంగమాయపల్లి బిడ్జి వెంటనే మంజూరు చేసి పనులు మొదలు పెట్టాలని కోరారు. దీనికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించి, పనులు వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

Advertisement

Next Story