లోగో డిజైన్ చేయండి.. క్యాష్ ప్రైజ్ పొందండి

దిశ, వెబ్‌డెస్క్ :
‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అంటే అందరికీ తెలిసిందే. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేసి, భారత్‌ స్వయంగా ఎదగడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు దేశం నలుమూలలా ఉన్న సాఫ్ట్‌వేర్ టెకీలు, స్టార్ట్-అప్ కమ్యూనిటీల కోసం ప్రధాని మోదీ ఇటీవలే ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రకటించగా.. అనూహ్య స్పందన లభించింది. తాజాగా మన దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కాంటెస్ట్‌ను తీసుకొచ్చింది. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ కోసం లోగో తయారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి రూ. 25 వేల బహుమతి కూడా ఇవ్వనుంది. దీనికి సంబంధించి క్రియేటివ్ లోగో తయారీ కాంటెస్ట్‌ను mygov.in నిర్వహిస్తోంది.

కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు.. mygov.inలోని క్రియేటివ్ కార్నర్ సెక్షన్‌లో తాము తయారు చేసిన లోగోను అప్‌లోడ్ చేయాలి. రీసెంట్ ఫొటో, పూర్తి అడ్రస్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను లోగోతో పాటు జతపర్చాలి. లోగోను జేపీఈజీ/పీడీఎఫ్/ పీఎన్‌జీ ఫార్మాట్లలోనే పంపాల్సి ఉంటుంది. లోగోను సీఎమ్‌వై‌కె, ఆర్‌జీ‌బీ ఫార్మాట్లలో తయారుచేయవచ్చు.

షరతులు వర్తిస్తాయి :

– ఆత్మనిర్భర భారత్ .. లక్ష్యం, ఉద్దేశం ‘లోగో’లో ప్రతిబింబించాలి
– ఒక పార్టిసిపెంట్ ఒక్క లోగోను మాత్రమే పంపించాలి.
– లోగో సైజ్ 5cmX5cm అలాగే.. 60cmX60cm ఉండాలి. పోర్టెయిట్ లేదా లాండ్‌స్కేప్‌లో ఉండొచ్చు.
– లోగో వెబ్‌సైట్లు, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి అన్ని చోట్లా వాడుకునేందుకు వీలుగా ఉండాలి.
– లోగోను డిజిటల్ ప్లాట్‌ఫైమ్‌లో మాత్రమే తయారుచెయ్యాలి.
– ఫైల్ రిజల్యూషన్ 300 పిక్సెల్స్‌కు తగ్గకూడదు.
– లోగోను కాపీ కొట్టరాదు. ఇంతకుముందెక్కడా కూడా వాడని లోగోనే పంపించాలి. కాపీరైట్స్ ఇష్యూస్ ఉండకూడదు
– గెలిచిన తర్వాత.. విజేతకు లోగోతో ఎలాంటి సంబంధం ఉండదు. లోగో పూర్తి హక్కులు కేంద్రానికి ఉంటాయి.
– విజేతను ఈమెయిల్ ద్వారా ప్రకటిస్తారు. దాంతో పాటు mygov.in బ్లాగ్ పేజీలో కూడా విజేత పేరును అనౌన్స్ చేస్తారు.
– గెలిచిన వ్యక్తి.. ప్రభుత్వం పంపిన ఈమెయిల్‌కు మూడు రోజుల్లో రిప్లయ్ ఇవ్వాల్సి ఉంటుంది. రెస్పాండ్ కాకపోతే.. మరో విజేతను ప్రకటిస్తారు.

Advertisement