- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందే రైతుల కోసం’
దిశ, కొత్తగూడ: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని డీసీఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కిష్టపురం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశ్యంతోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కొత్తగూడ మండల అధ్యక్షులు వేణు, ఎంచగూడ సర్పంచ్ నారాయణ, వెంకన్న, ఏఈఓ రాజు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.