- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గన్‌తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో గన్‌తో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. పక్కంటి వ్యక్తితో జరిగిన చిన్న వివాదానికి గన్ తో బెదిపింపులకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సివిల్ సప్లైస్ లో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న షేక్ ఫయాజ్ అహ్మద్‌కు ఇంటి పక్కన ఉన్న టోనీతో శుక్రవారం అర్ధరాత్రి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఫయాజ్ అహ్మద్ కోపోద్రిక్తుడై.. ఇంట్లో ఉన్న ఎయిర్ గన్ ను బయటకు తీసుకువచ్చి హల్ హల్ చేశాడు. గన్ చూపిస్తూ టోనీని భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఫయాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్నది ఎయిర్ గన్ గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం షేక్ ఫయాజ్ అహ్మద్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.
Next Story