డిపార్ట్ మెంటల్ పరీక్షల తేదీలు ఖరారు..

దిశ, వెబ్‌డెస్క్ :

కొవిడ్-19 నేపథ్యంలో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన డిపార్ట్ మెంటల్ పరీక్షలకు సంబధించిన తేదీలను రీ షెడ్యూల్ చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం ప్రకటించింది.

ఆక్టోబర్ 3 నుంచి 9 తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు హరిఅశోక్, జిల్లా అధ్యక్షుడు ఎండీ. వకీల్ వెల్లడించారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని.. పూర్తి వివరాల కోసం TSPSC వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement