- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సినేటెడ్ సిటిజన్స్‌కు.. ‘కొవిడ్ పాస్‌పోర్ట్’
దిశ, ఫీచర్స్: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇంకా పలు కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. కాగా పౌరుల రక్షణ, సౌకర్యార్థం డెన్మార్క్ కొవిడ్ పాస్‌పోర్ట్‌ను సృష్టించడం విశేషం. ఈ మేరకు ప్రపంచంలోనే తొలిసారిగా పౌరుల కోసం కొవిడ్ పేరిట ప్రత్యేక పాస్‌పోర్ట్‌ను రూపొందించిన దేశంగా డెన్కార్క్ నిలిచింది. ఈ పాస్‌పోర్ట్‌ను చూపించి కరోనా టీకా తీసుకున్న పౌరులు ఈజీగా విదేశాలకు పయనం కావచ్చు. అయితే అక్కడి పౌరులు, ఈ పాస్‌పోర్ట్ కోసం డెన్మార్క్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. టీకా ఎప్పుడు తీసుకున్నారో? ఆ వివరాలు ఇచ్చి అప్లై చేసుకుంటే ఆఫీసర్ల అప్రూవల్‌తో పాస్‌పోర్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా త్వరలోనే ఈ పాస్‌పోర్ట్‌ను డిజిటల్‌గా లాంచ్ చేయాలని అక్కడి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం.. బిజినెస్ ట్రావెల్స్ కోసం మూడు నెలల్లో డిజిటల్ కరోనా పాస్‌పోర్ట్ అందుబాటులోకి తీసుకొస్తామని వారు పేర్కొన్నారు.