- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2020-21లో రికార్డు స్థాయిలో పెరిగిన డీమాట్ ఖాతాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా పెట్టుబడులు పెట్టే అంశంలో కరోనా వ్యాప్తి తర్వాత ప్రజల ఆలోచన విధానం మారింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో డీమాట్ ఖాతాలు ప్రారంభించడమే దీనికి ఉదాహరణ. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.42 కోట్ల మంది కొత్తగా డీమాట్ ఖాతాలను ప్రారంభించగా, ఈ ఏడాది మార్చి నెలలో మాత్రమే ఈ సంఖ్య 19 లక్షలుగా ఉండటం విశేషం. 2019-20లో మొత్తం 49 లక్షల డీమాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి.
కొవిడ్-19 తర్వాతి పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారాలు నష్టపోవడం, ఇంకా ఇతర సవాళ్ల కారణ్నగా దేశంలోని పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లలో అవకాశాలను అనివేషిస్తున్నారని తెలుస్తోంది. ఇదివరకు బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ వంటి వాటిమీద ఇన్వెస్ట్ చేసిన చాలామంది ఇప్పుడు స్టాక్ మార్కెట్లను ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. స్టాక్స్, బాండ్ వంటి సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసేందుకు డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో డీమాట్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. 2020లో కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ అనంతరం మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. తక్కువ ధరలకు షేర్లు ట్రేడవ్వడంతో లక్షల మంది డీమాట్ అకౌంట్లను తెరిచారు.