మీటర్ రీడింగ్ కార్మికులకు కరోనా బీమా ఇవ్వాలి

by  |
మీటర్ రీడింగ్ కార్మికులకు కరోనా బీమా ఇవ్వాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేసే మీటర్ రీడింగ్ కార్మికులకు రూ.50లక్షల కరోనా బీమా సౌకర్యం కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన వినియోగదారులున్న ఇళ్లకు సైతం వెళ్లి మీటర్ రీడింగ్లు తీస్తున్నతమకు కాంట్రాక్టర్లు కనీసం జీతాలు సకాలంలో చెల్లించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ మేరకు టీఎస్ విద్యుత్ మీటర్స్ రీడర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ కుమార్, గుమ్మడి వెంకటేశ్వర్లు గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

చాలీచాలని జీతాలతో కుటుంబాలనే పోషించుకోలేని తమకు కరోనా సోకితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు వ్యవస్థతో పాటు పీసు రేటు విధానాన్ని రద్దు చేయాలని, హెల్త్ క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. నెలవారి పని దినాలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మాస్కు, శానిటైజర్ల, ఫేస్ షీల్డు గ్లాసులు, గ్లౌజులు ఇవ్వడంతో పాటు, డిపార్టుమెంటు నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని కోరారు.



Next Story

Most Viewed