- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించండి..!
by Shyam |

X
దిశ, హుస్నాబాద్: ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని మండల పరిషత్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబూడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయనపల్లి వినోద్ కుమార్ను ఎంపీటీసీల ఫోరం బృందం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు సమ్మిరెడ్డి, మల్లారెడ్డి, బీలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాల్సిన నిధుల గ్రాంట్స్ విడుదల కాలేదని తెలిపారు. దీంతో మండల, గ్రామ స్థాయిల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. ఎంపీటీసీలకు రూ. 50వేల గౌరవ వేతనంతో పాటు వెహికిల్ అలవెన్స్ 30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
Next Story