- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ టాయిలెట్ పేపర్ కాస్ట్ రూ.1,05,035 మాత్రమే..!
దిశ, వెబ్‌డెస్క్: లక్ష రూపాయల విలువైన ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా టాయిలెట్ పేపర్‌తో చుట్టబడిన రెండు చాక్లెట్ బార్‌లు వచ్చాయి. ఈ వింత సంఘటన ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో జరిగింది. డేనియల్ కారోల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో iPhone 13 Pro Max ధర సుమారు రూ.1,05,035 ఫోన్‌ను ఆర్డర్ చేయగా రెండు వారాల తర్వాత డెలివరీ వచ్చింది. ఎంతో ఆశతో డెలివరీ ప్యాకెట్ ఓపెన్ చేయగా టాయిలెట్ పేపర్‌తో చుట్టిన రెండు చాక్లెట్‌లు కనిపించాయి. ఆపిల్ వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 2న ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. కానీ స్టాక్ సమస్యల కారణంగా డెలివరీ ఆలస్యం అయింది. దాంతో డేనియల్ స్వయంగా DHL గిడ్డంగి నుండి పార్శిల్‌ను సేకరించాడు. పార్సెల్ ఓపెన్ చేయగా ఇలాంటి వింత ఘటన జరిగింది. క్రిస్మస్ ఆనందంగా గడపాలనుకున్న తనకు ఈ బహుమతి లభించిందని చాక్లెట్ బార్‌లు, టాయిలెట్ రోల్ ఫోటోలతో DHLని ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు. ఈ ఘటనపై డీహెచ్‌ఎల్ స్పందిస్తూ.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మేము ఈ కేసును ప్రాధాన్యతగా పరిశోధిస్తున్నాము. మిస్టర్ కారోల్‌కు అన్ని విధాల సహాకారం అందిస్తామని DHL ప్రతినిధి తెలిపారు.