కరోనా పోవాలా?.. అయితే రెండు పెగ్గులేయమంటున్న మహిళ

by Shamantha N |
కరోనా పోవాలా?.. అయితే రెండు పెగ్గులేయమంటున్న మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా పంజా విసురుతోంది. పలు రాష్ట్రాలు మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆంక్షల అమల్లో భాగంగా మాల్స్, బార్లు, వైన్స్ బంద్ చేస్తున్నాయి. కానీ ఈ మహిళ మాత్రం వైన్ షాపులు తెరవాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు రెండు పెగ్గులు పడితే కరోనా పారిపోతుందని చెబుతోంది.

ఢిల్లీకి చెందిన డాలీ అనే మహిళ మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో.. వైన్ షాపులు బంద్ అయ్యాయి. దీంతో మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులన్నీ ఖాళీ అవుతాయని, ఆక్సిజన్ సమస్య నుంచి బయటపడుతుందని ఈ మహిళ చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story