- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ టాప్.. హైదరాబాద్, చెన్నై చివరిలో
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. ఉత్కంఠ భరితంగా, సస్పెన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లు ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తున్నాయి. రాత్రి 7.30 అయితే చాలు.. క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మ్యాచ్‌లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్లు లక్షల్లో బెట్‌లు వేస్తూ హంగామా సృష్టిస్తున్నారు.
ప్రస్తుతం మూడు మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఇవాళ పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ జరగనుంది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో చెన్నైతో జరిగిన పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించింది.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను చూస్తే.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో కోల్‌కత్తా, మూడో స్థానంలో బెంగళూరు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడో స్థానంలో ఉండగా.. చెన్నై చివరి స్థానంలో ఉంది.