- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌కు పిచ్చి.. మెంటల్ హాస్పిటల్‌కు పంపాలి : సిక్కులు
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కంగనపై చర్యలు తీసుకోవాలని, తన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మణిజిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశాడు. ఖలిస్తానీ ఉగ్రవాదుల వల్లే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని స్టేట్‌మెంట్ ఇవ్వడం రైతులను అవమానపరచడమేనని ఆయన అభిప్రాయపడ్డాడు. తనను ద్వేషపూరిత ఫ్యాక్టరీగా అభివర్ణించిన మణిజిందర్ సింగ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో హేట్‌ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తున్న తనపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్‌ను కోరాడు. కంగనా పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకుని, తనను మెంటల్ హాస్పిటల్ లేదా జైలుకు తరలించాలని సూచించాడు. ఈ మేరకు మణిజిందర్ ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా గత నెల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగన.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ‘ఖలిస్తానీ టెర్రరిస్టులు ఈరోజు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. కానీ ఒక్క మహిళను మాత్రం మర్చిపోకూడదు. ఆమె ఎవరో కాదు.. వాళ్లను తన కాళ్లకింద నలిపేసిన ప్రధాని ఇందిరా గాంధీ’ అని షేర్ చేసింది.